Sunday, April 26, 2026
HomeNewsముర్రాటలు వేసి వేప చెట్టులను కాపాడుకోవాలి

ముర్రాటలు వేసి వేప చెట్టులను కాపాడుకోవాలి

– వేప చెట్లను పరిరక్షణకు పరిరక్షణకు కృషి చేయాలి
– దాట్ల సుబ్రహ్మణ్య వర్మ,
ముర్రాటలు వేసి వేప చెట్టులను కాపాడుకోవాలని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం సింహాచలం గోశాల వద్ద ఉన్న వేప చెట్లను పరిశీలించిన అనంతరం ఆయన శబల భోజనాల పండుగ నిర్వహించే ప్రదేశంలో కలిసిన విలేకరులతో మాట్లాడారు. గడిచిన ఆరు సంవత్సరాలుగా వేసవి కాలంలో వేప చెట్లు ఎండి పోవడం జరుగుతుంది అన్నారు. ఇది ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది అని వివరించారు. ఈ ఎండు తెగులు నివారణకు ప్రతి ఒక్కరూ బిందెల్లొ పసుపు నీళ్ళు కలిపి ముర్రాట తయారు చేసి చెట్టు మొదట్లో వెయ్యాలి అని కోరారు. వేప చెట్ల పరిరక్షణకు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంకల్ప కళా గ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతి రావు, జనరేషన్ యువ వ్యవస్థాపకులు నరేష్ కుమార్, తులసి నేచురల్స్ సత్యనారాయణ, వశిష్ట ఆశ్రమం ప్రతినిధి వంశీ ప్రియ, గోమాత్య ఆర్గానిక్ ప్రతినిధి బివిఆర్ రాజు, నేచురల్ ఫార్మర్ శ్రీ నాథ్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments