Home Politics Andhra Pradesh రావివలస లో పింఛన్లను పంపిణీ చేసిన సర్పంచ్

రావివలస లో పింఛన్లను పంపిణీ చేసిన సర్పంచ్

0

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వం అందజేస్తుంది , ఇందులో భాగంగా టెక్కలి మండలం రావివలస పంచాయతీ పరిధిలో అర్హులైన పేద కుటుంబాలకు నూతన పింఛన్లను సర్పంచ్ సర్లాన బాలకృష్ణ, గ్రామ పెద్దలు లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేశారు.

గ్రామంలో ఇటీవల మరణించిన మార్పు అప్పారావు, ఎలమంచిలి లచ్చయ్య కుటుంబాలకు నూతనంగా మంజూరైన లబ్ధిరాలు మార్పు కాశమ్మ, ఎలమంచిలి హేమలతకు గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్ బాలకృష్ణ పింఛన్లను స్వయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు ఇప్పిలి జగదీశ్వరరావు,మాజీ సర్పంచ్ జగదీష్ , మాజీ ఎంపీటీసీ నర్తు కృష్ణారావు, వీఆర్వో ధర్మాన అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version