Home Politics Andhra Pradesh ఘణంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

ఘణంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

0

సివి రామన్ కి నివాళులు అర్పించిన డా.కేఎన్ఆర్

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 76వ వార్డు శరత్ హైస్కూల్ లో ప్రిన్సిపాల్ రాము ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్జి నరసింగరావు , మండల విద్యాశాఖాధికారి రమణ ముఖ్య అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వాలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ పిబ్రవరి 28 తేదీన భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రపంచానికి సైన్స్ ని మరింత చేరువ చేసిన సందర్బంగా ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పలువురు విద్యార్థులు వాతావరణ సమతుల్యత ,పాడి పరిశ్రమల , శౌర కుటుంబం , ఏటియం , లావా, కరెంట్ గురించి తెలిసే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి చక్కగా వివరించారని తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టిడిపి నాయకులు పులి రమణారెడ్డి,బిజేపి మండల అధ్యక్షురాలు అనిత ,జిల్లా ఎస్సి మోర్చా కార్యదర్శి మనోహర్ ,కోలనీ అధ్యక్షులు రమణ , అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version