చోడవరం జయ జయహే :జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యములో చోడవరం ద్వారకా నగర్ ప్రభుత్వ ప్రాధమిక స్కూల్ పిల్లలకు పెన్ పెన్సిల్స్ రబ్బరు బిస్కట్స్ చాక్లేట్స్ శుక్రవారం పంపిణి చేశారు. చోడవరం ఎన్ హెచ్ ఆర్ సి ప్రాంతీయ కార్యాలయములో జాతీయ ఛైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వాహించామని ఎన్ హెచ్ ఆర్ సి ప్రాంతీయ ఛైర్మన్ దేవరపల్లి నవకుమార్ తెలిపారు ప్రధానోపాధ్యాయురాలు వెంకట లక్ష్మి, ఉపాధ్యాయులు ఈశ్వరరావు ఈ కార్యక్రమానికి అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు జయంతి పురస్కరించుకొని బాలలదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందాయకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంద్ర, జిల్లా, ప్రాంతీయ చైర్మన్లు వైస్ చైర్మన్లు కార్యదర్శి కోఆర్డినేటర్లు కన్వీనర్లు దేవరపల్లి నవకుమార్,ఆషా, ఫణి జ్యోతి, జోగా తరుణ్, నాగేష్, నాగేశ్వరరావు, అనిల్ కుమార్, పి.అబ్రహం, మణికంఠ, శివకుమార్, పైడి నాయుడు, చిట్టిబాబు కావ్య ఆరాధ్య తదితరులు పాల్గొన్నారు.
