బాపట్ల జిల్లా, వేమూరు మండలం కోడిపర్రు గ్రామానికి చెందిన కార్తీక్ ఫౌండేషన్ వ్యవస్థపక అధ్యక్షులు నండూరి కార్తీక్ కు వాజ్ పేయి అద్వాని సేవా సంస్థ వ్యవస్థాపకులు పాలకొలను పీరారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 22 ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా స్వచ్ఛందంగా నిరంతర సమాజంలో సేవలు చేస్తున్నటువంటి వారికి ఆన్లైన్ ద్వారా ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుమీద అవార్డ్స్ అందించడం జరిగింది. గత 8సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న కార్తీక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నండూరి కార్తీక్ ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు 2026కు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా కార్తీక్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు నండూరి కార్తీక్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా సమాజంలో మేం చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం పదవతరగతి విద్యార్థులకు పరీక్షలలో భయం లేకుండా దైర్యంగా పరీక్షలు రాసే విధంగా అవగాహన సదస్సు నిర్వహించడం అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయడం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం సేవలను గుర్తించి మాకు స్వాతంత్ర్య సమరయోధుడు అయిన నరసింహారెడ్డి పేరు మీద అవార్డు అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంస్థ వ్యవస్థాపకులు పాలకొలను పీరారెడ్డికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన నండూరి కార్తీక్.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డుకు ఎంపికైన నండూరి కార్తీక్
RELATED ARTICLES
