Home Politics Andhra Pradesh పౌరాణిక కళలు సమాజ చైతన్య వేదికలు

పౌరాణిక కళలు సమాజ చైతన్య వేదికలు

0

పద్య నాటకాలు జనం పరిరక్షించాలి,శుభలై రాష్ట్రస్థాయి పద్య నాటక పోటీలు,టెక్కలి జనవరి జయ జయహే,అభివృద్ధి చెందుతున్న సమాజంలో శాంతి సామరస్యం చైతన్యం ఆదరణ, ఆహ్లాదం ఆనందం ప్రేరణ ప్రేమ అందరిలో కలిగేందుకు పౌరాణిక, జానపద కళలు మానవ సమాజాన్ని ఎంతగానో ప్రభావం చూపుతాయి. జానపద పౌరాణిక సంస్కృతిక నాటకాలను బతికించాలంటే జనమంతా ఈ కళలను ఆదరించి ఆహ్వానించాలి.శ్రీకాకుళం జిల్లా హిరమండలం లోని శుభలై గ్రామం ఆర్ ఆర్ కాలనీలో వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్ లో చీమకుర్తి నాగేశ్వరరావు కళా పీఠం సారధ్యంలో రాష్ట్రస్థాయి పౌరాణిక నాటక పద్య పోటీలు ఘనంగా కడు రమ్యంగా జరిగాయి. ఈ ప్రాంతంలోని కళారాధకులకు కమ్మని నయనానందం కలిగించాయి పౌరాణిక పోటీలు , ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొన్నారు.ఈ పౌరాణిక పద్య నాటక పోటీల్లో ప్రధమ బహుమతిని వై సత్యం నాయుడు, ద్వితీయ బహుమతిని పుట్టా కృష్ణ, తృతీయ బహుమతిని వై ఎర్రమనాయుడు, ప్రత్యేక బహుమతిని రావణబ్రహ్మ పాత్రధారి హైదరాబాద్ కు చెందిన బాపనపల్లి వెంకటస్వామి గెలుచుకున్నారు. ఈ పోటీలను కళాపేట అధ్యక్షులు ఏ లింగమూర్తి, ఎల్ సత్యం మాస్టారు, కమిటీ ప్రతినిధుల సారధ్యములో కొనసాగింది.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలం, సుడా చైర్మన్ కొరీ కా న రవికుమార్ , కొరికాన భావనమ్మ ఏఎంసీ ఛైర్మన్ మామిడి రామకృష్ణ స్థానిక సర్పంచ్ లంక రోజా, జడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు, శ్రీకాకుళం జిల్లా సమతా సైనిక దళ్ అధ్యక్షులు చల్లా రామారావు మాస్టారు పలువురు కళాకారులు, కళా అభిమానులు పాల్గొని కళాకారుల ప్రతిభను కొనియాడారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version