Home Politics Andhra Pradesh సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

సేవా భావంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి

0

స్ఫూర్తిదాయక సేవలందిస్తున్న డాక్టర్ కందులకు అభినందనలు  సేవా భావంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు.
32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది పుష్పవతి అయిన అమ్మాయిలకు వెండి భరణిలు, పట్టు చీరలు, పసుపు కుంకుమలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కె.ఎన్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా, కార్పొరేటర్ గా విస్తృత సేవలు అందిస్తున్న డాక్టర్ కందుల నాగరాజును ఆయన అభినందించారు.సేవే దైవంగా భావించి, అందరికి అందుబాటులో ఉంటూ, నిస్వార్థ సేవలందిస్తు, అందరికీ ఆప్తుడుగా మారిన కందుల నాగరాజు ఎంతోమందికి స్ఫూర్తిదాయంగా నిలిచారని కొనియాడారు.
జనసేన పార్టీ నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సేవకు సరిహద్దులు, పరిమితులు లేవని చెప్పారు. సాటి వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.మానవత్వంతో స్పందించి నిస్వార్ధ సేవలు అందించాలని పేర్కొన్నారు.
ఈ ఈ క్రమంలో తాను సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.ఇందులో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో 32, 33, 34, 36వ వార్డులకు సంబంధించి పుష్పవతి అయిన 12 మంది అమ్మాయిలకు
పట్టు చీరలు, వెండి భరణిలు, పసుపు కుంకుమలు అందజేయడం జరిగిందన్నారు.
అలాగే తమ ట్రస్ట్ నుంచి నూతన వధువులకు బంగారు తాళిబొట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
నిరుపేద విద్యార్థులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వివ్యాంగులకు అండగా ఉంటూ వారికి తన పరిధిలో సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మచ్చ రాజు, నరేష్, రమేష్ పాడి,సీపీఐ బుజ్జి, బిజెపి వీరభద్రరావు, జనసేన మహిళా నేత నాగమణి,
కె.కృష్ణ, కె.రమేష్,రాగతి తాతారావు,
సోషల్ వర్కర్ గీత, అయేష, చిట్టెమ్మ,
కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్,దుర్గా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version