నాకు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉంది రాష్ట్ర మంత్రిని తప్పు త్రోవ పట్టించిన ఆర్డిఓ పాత్రికేయులతో పారిశ్రామికవేత్త డాక్టర్ బలగ ప్రకాష్ టెక్కలి జనవరి 23 జయ జయహే అధికార పూర్వకంగా నా కష్టార్జితం సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిపై రెవెన్యూ ఉన్నతాధికారి లేనిపోని ఆరోపణలు సృష్టించి రాష్ట్ర మంత్రి ని కూడా తప్పు త్రోవ పట్టిస్తున్న టెక్కలి ఆర్డీవో పై న్యాయమైన పోరాటం చేస్తానని దళిత పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, డాక్టర్ బలగ ప్రకాశ్ టెక్కలిలో మీడియా సమావేశంలో తెలిపారు. టెక్కలి ఆర్డిఓ వృత్తి ధర్మాన్ని విస్మరించి తన భూమిపై లేనిపోని అపోహలు సృష్టించి ఆర్డీవో కక్ష సాధింపు చర్యలతో మానసిక ఇబ్బందులకు గురి చేయడం తగదని దీనిపై న్యాయపరంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించి న్యాయం పోరాటం చేస్తానని తనకు న్యాయ వ్యవస్థ పై గౌరవం ఉందని బలగ అన్నారు. టెక్కలి డివిజన్ పరిధి రఘునాథపురం గ్రామంలో సర్వే నెంబరు 520 /3, మరియు 520/1లో రెండెకరాల భూమిని తాను సొంతంగా కొనుగోలు చేశానని ఈ భూమికి ఆస్తి పన్నులు కట్టానని అవసరమైన అన్ని అధికారిక ధృవపత్రాలు ఉన్నాయని గతంలో ఉన్నతాధికారులు ఇచ్చిన పత్రాలన్నీ తన వద్ద ఉన్నాయని పాత్రికేయులకు చూపించారు, ఈ భూమి ఆక్రమించినట్లు ఆధారాలు ఉంటే పూర్తిగా ఆ భూమిని వదులుకుంటానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే భూమిపై అన్ని పత్రాలు గతంలో ఆర్డిఓ కి చూపించమన్నారు అయినాప్పటికీ తనపై కక్షతో 2025 జూలై 21న హైకోర్టులో రెవెన్యూ డివిజనల్ అధికారి హైకోర్టులో కేసు వేశారని అయితే ఆ వ్యాజ్యాలను హైకోర్టు తిరస్కరించినట్లు తెలిపారు, అప్పటినుంచి ఆర్డీవో దళితుడునైన నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మీడియాకు తెలిపారు, భారత రాజ్యాంగం పరంగా న్యాయం కోసం పోరాడుతానని న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పారిశ్రామికవేత్త డాక్టర్ బలగ ప్రకాష్ స్పష్టం చేశారు.
నా భూమికి నానా అవస్థలు ఇది న్యాయమా
RELATED ARTICLES
