Friday, April 24, 2026
HomePoliticsAndhra Pradeshఉత్తమ ఉపాధ్యాయులు అభినందన సభలో పాల్గొన్న ఎం.పీ

ఉత్తమ ఉపాధ్యాయులు అభినందన సభలో పాల్గొన్న ఎం.పీ

ఉత్తమ ఉపాధ్యాయులు అభినందన సభలో పాల్గొన్న ఎం.పీ

కశింకోట లో ద్వారపురెడ్డి నూకరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులు మరియు ఉత్తమ విద్యార్థుల అభినందన సభకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సి.ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమం ద్వారపు రెడ్డి నూకరాజు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపూడి రెడ్డి పరమేశ్వర రావు ని ప్రత్యేకంగా అభినందించారు.తమ తండ్రి సంవత్సరీకాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ పరమేశ్వరరావుని సత్కరించారు.మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు.విద్యా రంగంలో ప్రతిభను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని ఎంపీ తెలిపారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments