Home Uncategorized సంఘం ఆర్థిక లావాదేవీలుపై ఈ నారీలకు శిక్షణ

సంఘం ఆర్థిక లావాదేవీలుపై ఈ నారీలకు శిక్షణ

0

దేవరాపల్లి, జయజయహే : డ్వాక్రా మహిళల ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరణపై మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జి. లావణ్య ఆధ్వర్యంలో ఈ-నారీలకు మన డబ్బులు మన లెక్కలు అన్న అంశాలపైన డ్వాక్రా మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు
దీని ఉద్దేశం ప్రతి సంఘము వారు చేస్తున్న పొదుపులు, అప్పులు, ఆర్థిక వివరాలు తీసుకున్న శ్రీనిధిలోను బ్యాంకు లింక్ ఏది ఉన్నది లోన్లను పొందిన ప్రతి ఒక్క సభ్యురాలు వివరాలు మొబైల్ యాప్ మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా ప్రతి ఒక్క సభ్యురాలు తన ఆర్థిక ఆదాయం తెలుసుకొవడానికి సంఘంలో చదువుకున్న సభ్యురాలను 10 సంఘాలకి ఒకరు చొప్పున ఈ-నారీలు గుర్తించి వారికి తనకు కేటాయించిన ఈ పది సంఘాల యొక్క సభ్యుల ఆర్థిక లావాదేవీలు అన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపిఎం ఎస్. ప్రభాకర్, సిసిలు, మొదటిగా కేటాయించిన పది గ్రామ సంఘాల ఈ-నారీలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version