Wednesday, April 29, 2026
HomePoliticsAndhra Pradeshస్వచ్ఛ రథం ను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల

స్వచ్ఛ రథం ను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ రథం ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ స్వచ్ఛ రథం ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ప్రత్యేక వాహనాలన్నారు. ఇవి గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల నుంచి ప్లాస్టిక్, ఐరన్, స్టీల్ వంటి పనికిరాని వ్యర్థాలను స్వీకరించి వాటి విలువను తగ్గట్టుగా కొబ్బరినూనె, సర్ఫ్, పప్పు గోధుమపిండి నిత్యవసరాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ వ్యర్ధ రహితంగా చేయడం పరిశుభ్రతను పెంచడం, ప్రజలకు ప్రయోజకరమైన సరుకులు అందించడం లక్ష్యంగా ప్రతి 15 రోజులకు లేదా వారానికి రెండు సార్లు ఇంటికి వచ్చి తడి చెత్త పొడి చెత్త స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు.
కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి అప్పల రాజు , పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ ఐత సింహాచలం , బిజెపి నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రామనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు, కొనుగంటి కనకరాజు , ముధపాకా శివ, సీనియర్ నాయకులు కరక దేవుడు , దాట్ల మధు,మొదలగు పెందుర్తి మండల సీనియర్ నాయకులు , వార్డు అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments