రాష్ట్రంలో రెండో కాణిపాకంగా పేరొందిన చోడవరం స్వయంభు విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవానికి భక్తులు మూత్రంగా తయారు చేయించిన రథాన్ని ఉగాది సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు గురువారం ప్రారంభించారు. ఆలయ అర్చకుడు కొడమంచిలి చలపతిరావు ప్రోత్సాహంతో మాజీ ధర్మకర్త సువ్వాడ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు ఈ రథం నిర్మాణానికి 6 లక్షల రూపాయలు విరాళం అందజేస్తే, భక్తులు మరో రెండు లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మొత్తం ఎనిమిది లక్షల రూపాయలతో ఈ టేకు రథాన్ని సుందరంగా తయారు చేయించారు. పర్వదినాల్లో ఈ రథంపై స్వామివారిని ఊరేగిస్తారు. దీంతో గురువారం ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా రథం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వైన్ స్వామివారి ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెబుతూ ఈ రథం నిర్మాణానికి సహకరించిన విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు మిగిలను దాతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని రథంలో ప్రజలు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈవో ఎస్ వి సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు పి సాంబ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
