సుమారు 5 లక్షలకు పైగా ఆస్తి నష్టం.
చోడవరం – చీడికాడ రోడ్డులో మైచర్లపాలెం, వరహాపురంకు చెందిన కొంతమంది రైతాంగం తాలూకా సరుగుడు తోటలు గురువారం అగ్నికి ఆహుతి అయ్యాయి. వరహపురం రెవెన్యూ కు చెందిన సుమారు 20 ఎకరాల్లో ఆర్.కొండలరావు అనే ఆసామి లీజు పద్ధతిలో సాగు చేస్తున్న ఈ సరుగుడు తోట దగ్ధమయింది. మైచర్లపాలెంకు చెందిన బూరె అప్పారావు, మైచర్ల లక్ష్మీ, ఆర్లి దేముళ్ళు, బూరె నాగేశ్వరరావు లు ఈ ప్రమాదం గురించి అగ్నిమాపక అధికారులు తెలియజేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలం చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు చోడవరం అగ్నిమాపకాధికారి బి.వి.రామస్వామి తెలియజేశారు.
