Sunday, April 19, 2026
HomeNewsరోడ్డు పనులు పరిశీలిస్తున్న మంత్రి కొలుసు..

రోడ్డు పనులు పరిశీలిస్తున్న మంత్రి కొలుసు..

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చెయ్యాలి నాణ్యత లోపిస్తే అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు డివిజన్ ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో శుక్రవారం ఆర్ అండ్ బి తారు రోడ్ల నిర్మాణ పనులను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. పనులు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రహదారుల వేగంగా నిర్మాణాలు పూర్తయితే ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు.
అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులు అయితే నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ప్రజలు సౌకర్యమే ప్రభుత్వ ధ్యేయమని, మౌలిక వసతులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments