Home Uncategorized మెడికల్ బోర్డు సర్టిఫికేట్ రూ. 10 లక్షలు పైనే…!

మెడికల్ బోర్డు సర్టిఫికేట్ రూ. 10 లక్షలు పైనే…!

0

అధికారం లేకపోయినా…అడ్డదారుల్లో దోపిడీ
` అందినంతా దోచుకోవడానికేనా
` రూ. 10 లక్షలు పైనే చేతులు మారినట్టు లెక్క
` కేజీహెచ్ అవినీతిపై రోజుకో కధనం
` అయినా మార్పు లేని వైద్య అధికారులు

వడ్డించే వారు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా…చాలు అంటారు. అలాంటి వడ్డింపు కేజీహెచ్‌లో కొద్ది మాసాల కిందట చోటు చేసుకుంది. రూ. 10 లక్షలు అందిపుచ్చుకుని తనకు లేని అధికారాలను కూడా కల్పించుకుని మరీ పర్యవేక్షణాధికారి అన్యాయంగా వడ్డించేయడం వెనుక భారీ ఎత్తున చేతులు మారినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వడ్డింపునకు సంబంధించి విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
సాధారణముగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ ద్వారా తమ పిల్లలకు ఇచ్చుకునే సదుపాయం ప్రభుత్వం జీవో నెంబర్లు 504, 309, 214, ప్రకారం కల్పించింది. ఆ మేరకు తాము పనిచేయుచున్న పోస్ట్ ను మెడికల్ బోర్డు వారి ద్వారా పనిచేయుచున్న వ్యక్తి అనర్హుడని దృవీకరించినచో, నిభందనల ప్రకారము ఆ వ్యక్తి ఆ ఉద్యోగము చేయుటకు అనర్హుడని దృవీకరిచినచో త్రిసభ్య కమిటి ( జిల్లా కలెక్టర్, సంబంద శాఖ హెచ్.ఓ.డి. మరియు జిల్లా వైద్య శాఖ అధికారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్) వారి నివేదికలు పరిశీలించి, నిజ నిర్ధారణ చేసి, ఆ ఉద్యోగి అర్హుడైనచో, ఆ ఉద్యోగానికి పనికిరాడని కమిటీ దృవీకరించిన తరువాత, ఆ ఉద్యోగికి అనారోగ్య కారణముల వలన పదవీ విరమణ చేసేందుకు అనుమతి మంజూరు చేస్తారు. అలాంటి ఉద్యోగి జీవించేందుకు, జీవనము చేయుటకు ఎటువంటి ఆధారములేని కుటుంబ సభ్యుýT ఉన్నచో వారికి ప్రభుత్వ ఉద్యోగము ద్వారా జీవనాధారము కలిగించుటయే ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ జీవోకు తూట్లు పొడుస్తూ భారీ ఎత్తున బేరాలు సాగిస్తున్నారు. నిబంధనల మేరకు 1. పక్షవాతం, 2. కిడ్నీ 3. లివర్ 4. కేన్సర్ 5. పార్కిన్సన్స్ వ్యాధి 6. డ్రైవరులకు కాలు చేయి లేవక పోవటం లాంటి జబ్బులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగము ద్వారా జీవనాధారము కల్పిస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు కధ మొదలయ్యింది. ప్రభుత్వం జీవోల్లో పేర్కొన్న 5 రకముల జబ్బులు లేకపోయిన, మన కేజిహెచ్ వైద్య అధికారుల బృందం, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చిత్రీకరించి తమకు అందినంతా నొక్కేసారు. మరింత లోతుగా వివరాల్లోకి వెళితే కేజిహెచ్ లో పనిచేయుచున్న ఒక సీనియర్ సహాయకులు తనకి జ్ఞాపక శక్తి లేదని, అందుకే తాను పదవీ విరమణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వాస్తవానికి ఆ ఉద్యోగి జోనల్ కేడర్ కి సంబంధించిన ఉద్యోగి. అంటే ఆ ధరఖాస్తు ను వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు కార్యాలయానికి పంపించాలి. కానీ ఇక్కడే అంతా మాయాజాలం జరిగింది. ఎలాగంటే ఆ ధరఖాస్తు ను రీజనల్ డైరెక్టర్ కు పంపకుండా సంబంధిత గుమస్తా బి.ఉమా, సూపరింటెండెంట్ ఐ. వాణి ఆదేశాలతో నేరుగా మెడికల్ బోర్డుకు రిఫర్ చేసేశారు. ఇక అక్కడి నుంచి ఫైల్ ఎక్కడా ఆగకుండా ఆఘమేఘాల మీద పరుగులు తీసింది. ఆ ఉద్యోగి వైద్య పరీక్షల కోసం హాజరు ఓపి నెంబర్ : 20250630054 ద్వారా వైద్య పరీక్షలకు హాజరు కాగా న్యూరో విభాగ ప్రొఫెసర్ డా. ఎస్. గోపి ఇన్ పేషెంట్ గా చేర్చుకోమని ఆదేశించారు. మెడికల్ బోర్డు ఏర్పాటుకు రూ. 2 వేలు ఆస్పత్రి అభివద్ది సొసైటీకి చెల్లించాల్సి ఉంటాది. కానీ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బే ప్రధానంగా భావించిన అధికారులు కేవలం 10 నుండి 12 దినములలో దరఖాస్తుదారుడైన కేజిహెచ్ సీనియర్ సహాయకునికి మెదడు సరిగ్గా పని చేయడం లేదని ధవీకరించి గత నవబంర్ 18న సర్టిఫికేట్ జారీ చేశారు. ఉన్నతాధికారుల చొరవ లేకుండా ఈ తంతు ఇంత వేగంగా జరిగిపోతుందా అంటే …ఆలోచించాల్సిన విషయమేనని అనుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చకచకా నడపడంలో చొరవ తీసుకున్న పర్యవేక్షణాధికారి ఒకరైతే పలు విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు బొంగు శ్రీనివాసరావు, ఎస్ సుభ్రమణ్యం, ఎస్ గోపి, తదితరులు పాత్రధారులుగా ఉన్నారు. అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉంటూ…ముక్కు సూటిగా వ్యవహరించే రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి కేజీహెచ్ వర్గాలను వివరణ కోరినట్టు తెలిసింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version