Home Politics Andhra Pradesh ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

0

శ్రీ పంచమి పురస్కరించుకొని శుక్రవారం చోడవరం విజ్ఞాన పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. గత 13ఏళ్లుగా విద్యార్థులకు సామూహిక ఉచిత అక్షరాభ్యాసం పి ఎస్ పేట ఏవిఎన్ ఆచార్యులు నేతృత్వంలో అర్చక బృందం సామూహిక ఉచిత అక్షరాభ్యాసం విజ్ఞాన్ స్కూల్ డైరెక్టర్ ఎంఎంకే రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పండు బాంగనే శుక్రవారం కూడా విద్యార్థులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. మండలంలో గల 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలిరాగా పూజకు కావలసిన సామగ్రి స్కూలు యాజమాన్యం సమకూర్చి కార్యక్రమాన్ని నిర్వహించింది. అనంతరం విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రసాద వితరణ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version