Home Politics Andhra Pradesh రోడ్డు కోసం గుర్రాల యాత్ర

రోడ్డు కోసం గుర్రాల యాత్ర

0

దీర్ఘకాల సమస్యగా ఉన్న రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మాడుగుల మండలంలో గల ఆదివాసీలు గుర్రాలతో పాదయాత్ర నిర్వహించారు.అనకాపల్లి జిల్లా మాడుగుల,చోడవరం నియోజకవర్గాల పరిధిలో మాడుగుల మండలం అవరువాడ పంచాయతీ పశువులు బంధ , రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ. సోంపురం బంధలు లో కొందు కుటుంబాలు సామలమ్మ కొండపై మొత్తం 21కుటుంబాల వారు 120 జనాభా జీవనం సాగిస్తున్నారు. గతంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సేదరి వెంకట్రావు,కొర్ర బాబురావు అనారోగ్యంతో మరణించారు. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే రోడ్ సౌకర్యం లేదు. గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు తో పాటు అనారోగ్యం వస్తే రోడ్డు సౌకర్యం డోలు కట్టుకొని మూడు కిలోమీటర్లు ఎత్తయిన కొండలు దాటుకుంటూ బంగారుబందులు రోడ్డు వరకుడోలిలోతీసుకొస్తాం. అక్కడి నుంచి కొత్తకోట పిహెచ్సి కి వెళ్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సౌకర్యం కల్పించారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసాం. జిలుగులోవా మీదికా పశువులు బంధ గ్రామం వరకు మూడు కిలోమీటర్లు 2 కోట్ల పది లక్షల రూపాయలు మెటల్ రోడ్డు కోసం ఇప్పటికే ప్రతిపాదనంగా పంపించారు.నేటికీ రోడ్డుకి నిధులు మంజూరు చేయకపోవడంతో మాకు డోలుమూతలు తప్పడం లేదనీ గిరిజనులు వాపోతున్నారు.
రేషన్ బియ్యం,పెన్షన్, నిత్యవసరవస్తువులు తెచ్చుకోవాలంటేగుర్రాల మీదే ప్రయాణం చేయవలసి వస్తుందనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు నీ కూడా కోరామన్నారు. ఈ నేపథ్యంలోపశువులు బంద, జీడుగులోవ, సోంపురం బందరు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈ గుర్రపు యాత్ర ద్వారా కొడుతున్నారు. తవ్వేసి వదిలేసిన రోడ్లకు బిల్లులు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కే గోవిందరావు , మాడుగుల నియోజవర్గంఅధ్యక్షులు సేదరి కామేశ్వరరావు. కొర్ర మహేష్, సేదరి రాజబాబు, కొర్ర బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version