వసంత పంచమి శ్రీ పంచమి పురస్కరించుకొని లక్ష్మీ సరస్వతి కటాక్షం సిద్ధించేందుకు శుక్రవారం మాడుగుల మండల ప్రాథమిక పాఠశాలలో (గడ్డ బడి లో) విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సుమారు 20 మంది విద్యార్థులకు తొలి విడతగా లక్ష్మి, సరస్వతి పూజలు నిర్వహించి అక్షరాల దిద్దించారు. ఈ సందర్భంగా శ్రీ పంచమి విశిష్టతను విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తెలియజేశారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నేతాజీ దేశానికి అందించిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు కొప్పోజు శ్రీనివాసరావు, ఉపాద్యాయులు సిరిపిల్లి సూర్యనారాయణ ,బట్టా ప్రభాకరరావు,శాంతి అమృత,త్రివేణి,కల్యాణి, సి ఆర్ పి శారద , ఎస్ఎంసి చైర్మన్ పుట్టా కొండలరావు,నాగలక్ష్మి ,తల్లి దండ్రులు పాల్గొన్నారు.
