శ్రీలక్ష్మీ గణపతి లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ,కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్టా భూషణం , సెక్రటరీ కచ్చళ్ళ శ్రీనివాసరావు , క్యాషియర్ దన్నిన గోవిందరావు , వైస్ ప్రెసిడెంట్ పుర్రే కనకారావు , జాయింట్ సెక్రెటరీ అనిమిరెడ్డి ఈశ్వరరావు , కమిటీ సభ్యులు సహకారంతో శ్రీలక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీగా అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నసమారాధన నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
