ఈనెల 25 న ఆదివారంతో కూడిన రథసప్తమి పురస్కరించుకొని చోడవరం పతంజలి యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో చోడవరం ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉచిత సామూహిక సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించనున్నట్టు యోగ గురువు పుల్లేటి సతీష్ శుక్రవారం తెలిపారు.ఆ సూర్య భగవానుడు ద్వారా అందరికీ శక్తిని సామర్థ్యాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్షుని అందాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని సంకల్పంతో ఈ ఉచిత సామూహిక 108 సూర్య నమస్కారాలు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరు 12 రౌండ్స్ మంత్రాలతో సూర్య నమస్కారాలు చేయడం ద్వారా హైబీపీ మధుమేహం అధిక బరువు, గ్యాస్టిక్, మలబద్ధకం, కీళ్ల నొప్పులు, కోపం భయం, ఆందోళన వంటివి తగ్గించుకొని అందాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ.. మరిన్ని వివరాలకు 9291276900 మొబైల్ నెంబర్ నీ సంప్రదించాలన్నారు
