Home Politics Andhra Pradesh జాతిరత్నం సుభాష్ చంద్రబోస్.

జాతిరత్నం సుభాష్ చంద్రబోస్.

0

టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ,సుభాష్ చంద్రబోస్ 130వ జయంతిని పురష్కరించుకొని భీమిలి మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న బోస్ నిలువెత్తు విగ్రహానికి గంటా నూకరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను ఈ దేశం నుండి తరిమి కొట్టవచ్చని పూర్తిగా నమ్మి అది ఆచరణలో పెట్టిన ధీరుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఆంగ్లేయులను ఈ దేశం నుండి తరిమి కొట్టుటకు ఆయన చేసిన పోరాటం గాని, ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు గాని దేశంపై ఆయనకు ఉన్న భక్తికి ప్రతిరూపమని అన్నారు. ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా దేశ పౌరులను చైతన్యవంతులను చేయడం, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించడం బోస్ పోరాటప్రతిభకు నిదర్శనమని అన్నారు. చివరకు ఆయన మరణం ఒక మిస్టరీగా మారిందని అన్నారు. అది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నగా మారిందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్య అనంతరం సుభాష్ చంద్రబోస్ జయంతిని పురష్కరించుకొని ప్రతీ ఏటా జనవరి 23వ తేదీన పరాక్రమ్ దివస్ (శౌర్య దినోత్సవం )గా పిలుస్తారని అన్నారు. నాడు ఈ దినాన్ని పార్లమెంట్ లో చట్టం చేసి దేశమంతా ఘనంగా జరుపుకుంటారని ఇదే బోస్ కి దేశం ఇచ్చే ఘన నివాళులు అని గంటా నూకరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, మారోజు సంజీవ్ కుమార్, కొక్కిరి అప్పన్న, రాజగిరి రమణ తదితరులు బోసు కి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version