Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshపాత కక్షలతో వ్యక్తి హత్య

పాత కక్షలతో వ్యక్తి హత్య

పాత కక్షలు మూలంగా ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన మాడుగుల మండలంలో చోటుచేసుకుంది.ఈ మేరకు ఎస్ఐ నారాయణరావు శుక్రవారం విలేకరులకు అందించిన వివరాలు ప్రకారం మాడుగుల మండలం జంపిన గ్రామానికి చెందిన పిచ్చేటి ఉపేంద్ర (27) ఈనెల 26వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో జంపెన నుంచి టూ వీలర్ పై కింతలి వెళ్తుండగా మార్గమధ్యంలో గాదిరాయి విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో గల మూడు రోడ్లు కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిని రాట్లతో తలపై బాధడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచినాము నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఈ నేపథ్యంలో అనకాపల్లి డిఎస్పి శ్రావణి, సీఐ కృష్ణ, ఎస్ఐ నారాయణరావు సిబ్బందితో క్లూస్ టీమ్ తో పాటు సంఘటన స్థలానికి చేరుకొని మరిన్ని వివరాలు సహకరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments