మోటార్ సైకిల్ పై సారాను అక్రమంగా తరలిస్తుండగా కలం రాంబాబును రంపచోడవరం మండలం పెనుకూలపాడు గ్రామానికి చెందిన అతనిని అదుపులోకి తీసుకున్నట్లు గోకవరం ఎస్సై వి ఎన్ వి పవన్ కుమార్ తెలిపారు సదరు రాంబాబు వద్ద నుండి 35 లీటర్ల సారా హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు రిమాండ్ నిమిత్తం రాంబాబుని కోర్టు నందు ఆధారపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా గోకవరం ఎస్సై మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమసారా తయారీ,రవాణా విక్రయాలు చట్ట విరుద్ధ కార్యక్రమాల్లో పాల్గొని అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు ప్రజలు చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై తెలిపారు
