Home News కోటి సంతకాల సేకరణ లో పాల్గొన్న మళ్ల విజయ ప్రసాద్, డాక్టర్ జాన్ వెస్లీ

కోటి సంతకాల సేకరణ లో పాల్గొన్న మళ్ల విజయ ప్రసాద్, డాక్టర్ జాన్ వెస్లీ

0

విశాఖపట్నం (జయ జయహే): పశ్చిమ నియోజకవర్గం మల్కాపురం,62వ వార్డులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయ్ ప్రసాద్ మరియు వైస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీసెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు మల్ల విజయప్రసాద్ ను జాన్ వెస్లీ శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు, చింతా ప్రభాకర్ అధ్యక్షత వహించారు ఈ సందర్బంగా మల్ల విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదని తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదని తెలియజేశారు. విద్య, వైద్యం అనేవి ప్రజల ప్రాథమిక హక్కులకు, ప్రజల మనోభావాలకు, జీవితాలకు సంబంధించిన అంశమని వాటిని తాకట్టుపెట్టే అధికారం నైతికంగా ఏ ప్రభుత్వానికి ఉండదని తెలియజేశారు. క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే వాటితో పాటు బోధన ఆసుపత్రులు కూడా ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోతాయని,వారు వ్యాపారత్మక దృక్పథంతోనే ఆసుపత్రులను నిర్వహిస్తారని అందువల్ల చిన్నచిన్న పరీక్షలు కూడా డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిస్థితి వస్తుందని, ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు దూరం అయిపోతాయనిసామాన్య ప్రజలు వైద్యాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రులలో వస్తుందని తెలియజేశారు.భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీ లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చి నిర్మాణాలు ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ కి వైద్యరంగంలో ఒక వరంగా భావించాలి. ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రం సాధించలేని ఒక రికార్డ్. మిగతా రాష్ట్రాలలో ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు కావాలని కేంద్రాన్ని బ్రతిమిలాడుతుంటే ఇక్కడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మెడికల్ కాలేజీలు వద్దని చెప్పి కేంద్రానికి లేఖలు రాయడం చాలా విచారించదగ్గవలసిన విషయం అని తెలియజేశారు ఇప్పటికైనా ఈ కూటమిప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలే తిరుగుబాటు చేస్తారని అందుకు ఈ సంతకాల సేకరణ ఉద్యమమే నాంది పలుకు తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండప్పు నాగేశ్వరరావు , జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ షరీఫ్ పలువురు వార్డు అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version