Home News ఉర్దూ అకాడమీ చైర్మెన్ గా ఫారూక్ శుబ్లీ

ఉర్దూ అకాడమీ చైర్మెన్ గా ఫారూక్ శుబ్లీ

0
  • ఉర్దూ అకాడమీ చైర్మెన్ గా భాద్యతలు స్వీకరణ
  • మైనారిటీ మంత్రి ఫరూక్ సమక్షంలో భాద్యతలు చేపట్టిన ఫారూక్ శుబ్లీ
  • అమరావతి  (జయ జయహే)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా విజయవాడ కు చెందిన ఫారూక్ శుబ్లీ ని నియమిస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ గా శుబ్లీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం లోని మూడవ బ్లాక్ లో మైనారిటీ శాఖ పేషి కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ భాషాభివృద్ధి, ఉర్దూ ఘర్-షాదీ ఖానాలు, శిక్షణ కేంద్రాల సమర్థ నిర్వహణ కోసం క్షేత్రస్థాయిలో , ప్రణాళిక బద్ధంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శుబ్లీ కి సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ల సలహాలు, సూచనలతో ఉర్దూ అకాడమీ పేరు ప్రతిష్టలను చైర్మెన్ గా మరింత ముందుకు తీసుకెళ్తానని ఫారూక్ శుబ్లీ పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం,డిప్యూటీ సీఎం, విద్యామంత్రి, మైనారిటీ మంత్రి, పార్టీ అధిష్టానానికి ఫారూక్ శుబ్లీ కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version