Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshకోస్టల్ సైకిల్ యాత్రను విజయవంతం చేయండి...!

కోస్టల్ సైకిల్ యాత్రను విజయవంతం చేయండి…!

దేశంలో ఉండే తీరప్రాంత మత్స్యకారులలో దేశ రక్షణలో భాగంగా అవగాహన కల్పించడం కోసం సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేసే వందేమాతరం కోస్టల్ సైకిల్ యాత్రను దిగ్విజయం చేయాలని డిప్యూటీ కమాండెంట్ వికాస్ కుమార్ సాహు కోరారు. భీమిలి జోన్ 3వ డివిజన్ మత్స్యకారుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వందేమాతరం సైకిల్ యాత్ర యొక్క వివరాలను కమాండెంట్ వికాస్ కుమార్ సాహు వివరించారు. ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం 3గం. ల ప్రాంతంకి భీమిలి తీరంకి ఈ యాత్ర చేరుకుంటుందని అన్నారు. మత్స్యకారులు తీరప్రాంత రక్షణలో ఏవిధంగా ఉండాలనే విషయంపై అవగాహన కల్పించడం కోసం దేశమంతా సైకిల్ యాత్ర చేస్తున్నామని దీనికి మీయొక్క సహకారం కావాలని కోరారు. మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు మాట్లాడుతూ సముద్రంలో వేటసమయంలో గాని, తీరంలో గాని మత్స్యకారుడు తుపాకి చేతిపట్టని సైనికుడిలా ఉంటాడని అన్నారు. కొత్తవ్యక్తులు వచ్చినా, సముద్రంలో ఏ ఇతర సందేహంతో కూడిన బోటు కనిపించినా ముందుగా స్పందించింది మత్స్యకారుడేనని అన్నారు. దేశ రక్షణ కోసం మీరు చేస్తున్న ఈ యాత్రకు మా సహకారం ఉంటుందని అన్నారు. మరొక మత్స్యకారుల నాయకుడు మైలపల్లి షణ్ముఖరావు మాట్లాడుతూ తీరప్రాంత మత్స్యకారులను దేశ రక్షణ కోసం సంఘటితం చేయడం కోసం మీరు చేస్తున్న సైకిల్ యాత్ర శుప్రధమని అన్నారు. ఇలాంటి కార్యక్రమం విజయవంతంలో మా మత్స్యకారులు ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ కమాండెంట్ ఏ.కె.మహాపాత్రు, ఇన్స్పెక్టర్స్ ఎస్.సి.ఘోష్, హెచ్.ఎల్. మీనా, ఎల్.వి. రామకృష్ణ, ఇతర మహిళా అధికారులతో పాటు మత్స్యకారుల నాయకులు వాడమొదలు సత్యారావు, కాసరపు నాగరాజు, మట్టా దాసు, తెడ్డు రామదాసు, తెడ్డు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments