Home Politics Andhra Pradesh ఘనంగా శెట్టి బలిజల పితామహుడు దొమ్మేటి జయంతి వేడుకలు

ఘనంగా శెట్టి బలిజల పితామహుడు దొమ్మేటి జయంతి వేడుకలు

0

శెట్టి బలిజల పితామహుడు, ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం దొమ్మేటి వెంకటరెడ్డి సేవలను గుర్తించి ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ… అణగారిన వర్గాల అభివృద్ధి, శెట్టిబలిజ సమాజ అభ్యున్నతి, విద్యా ప్రాచుర్యానికి దొమ్మేటి వెంకటరెడ్డి గారు చేసిన సేవలు అపారమని కొనియాడారు. భారత స్వాతంత్ర్య సమరంలోనూ ఆయన తన వంతు పాత్ర పోషించారని, వయోజన విద్యకు కృషి చేసిన మహానీయుడని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏఆర్) యల్. చెంచి రెడ్డి, డీఎస్పీ (ఎస్‌బీ) బి. రామకృష్ణ, డీఎస్పీ (ఏఆర్) రవికుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version