Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshభారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుదాం

భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుదాం

భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుదాం.. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకుందాం..అని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.
విశాఖ రైల్వే స్కూల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్సిసి క్యాడేట్స్ పరేడ్ నిర్వహించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
ఈ రోజు మన అందరి హృదయాల్లో దేశభక్తి భావనను నింపే ప్రత్యేకమైన రోజుని చెప్పారు.. ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో గౌరవంగా, ఆనందంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ప్రభుత్వ వేడుక మాత్రమే కాదని, భారతదేశంగా మనం కలిసి నిలబడి ఉన్న గర్వానికి ప్రతీక అని వెల్లడించారు.
ఇప్పటికే మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇన్ని సంవత్సరాలుగా భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, ఎన్నో విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాజ్యాంగం చూపించిన మార్గంలో నడుస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ఒక బలమైన దేశంగా ఎదిగిందన్నారు. ఈ రోజు మనకు గతాన్ని గుర్తు చేసే రోజు మాత్రమే కాదు, భవిష్యత్తుపై ఆశలను నింపే రోజు కూడా. మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో, ఈ రోజు ఎక్కడ ఉన్నామో ఆలోచించుకునే సందర్భమే ఈ గణతంత్ర దినోత్సవమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మై మీనాక్షి, పి ల్.సుధా, ఏఎస్ రాజా, ఇ. మేరి సుశీల, ఎస్సార్ తులసి, కె ఎస్ విమల, పవన్ కుమార్, కే.రామారావు, ఎన్సిసి ప్రసన్నకుమార్, కే.అప్పారావు,కే.నీలిమ, భవాని, సిపిఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments