Sunday, May 3, 2026
HomePoliticsAndhra Pradeshభగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ , గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ , గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95వ వర్ధంతి సందర్భంగా సోమవారం చోడవరంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.
ఉషోదయ కాలేజీ నుండి కొత్తూరు వరకు సాగింది. అనంతరం మానవహారం నిర్వహించి, విద్యార్థులు, ప్రజలు నాయకులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు ,సుఖదేవుల ప్రాణ త్యాగాలు తో స్వాతంత్రం సిద్ధించుకోవడం జరిగిందని వారి స్ఫూర్తితో దేశంలో పెరిగిపోతున్న డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల మాఫియాలను అరికట్టడం కోసం విద్యార్థులు, యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. నేడు డ్రగ్స్ మాఫియాలు పేచ్చి మీరు పోయి విద్యార్థులను, యువతను బలి పశువులను చేసి తప్పుదోవ పట్టించి గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు చేస్తున్నారని అన్నారు. వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీల అండదండలు చూసుకుని మాఫియాలు రెచ్చిపోతున్నారని అన్నారు. అన్ని పార్టీల్లోని డ్రగ్స్, గంజాయి మాఫియాలతో సంబంధం ఉన్న వారిని బహిష్కరించాలని అన్నారు.
అనంతరం చోడవరం లోని బాలికల వసతి గృహంలో భగత్ సింగ్ , రాజగురు, సుఖ దేవ్ ల వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గూనూరు వరలక్ష్మి, డివైఎఫ్ఐ నాయకులు ఎస్ వి నాయుడు, దేవుళ్ళు, నాగిరెడ్డి సత్యనారాయణ, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments