Thursday, April 23, 2026
HomePoliticsAndhra Pradeshహెరిటేజ్ పాల ఉత్పత్తుల పై కుట్రలును తిప్పి కొడదాం. మాజీ ఎంఎల్సి బుద్ధ నాగ జగదీష్

హెరిటేజ్ పాల ఉత్పత్తుల పై కుట్రలును తిప్పి కొడదాం. మాజీ ఎంఎల్సి బుద్ధ నాగ జగదీష్

తిరుమల లడ్డు షిఫ్ట్ దర్యాప్తులో పలు రసాయనలతో నెయ్యి తయారు చేసినట్లుగా సుప్రీంకోర్టుకి ఛార్జ్ షీట్లో స్పష్టమైన తర్వాత కూడా జగన్ రెడ్డి ,మండల ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఇటు ప్రజలను ,భక్తులను పక్కదోవ పట్టించడానికి మూడు దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న హెరిటేజ్ సంస్థ పై తప్పుడు ప్రచారం చేసేందుకు వైసిపి నేతలు కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నాయకుల ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి విధించే శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరని హెరిటేజ్ ప్రొడక్షన్ పాలు నెయ్యి, ఉత్పత్తులు నాణ్యత పాటిస్తూ సరఫరా చేస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు ప్రత్యేకతలు పొందడం జరిగిందని హెరిటేజ్ సంస్థ నుండి ఏ దేవాలయానికి గాని ఇంతవరకు నెయ్యి సరఫరా చేయలేదని కానీ వైసీపీ నాయకులు తమ మానస పుత్రిక అబద్దాల సాక్షి మీడియా ద్వారా తప్పుడు ప్రచారంతో హెరిటేజ్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలో చేస్తున్నారని నాగ జగదీష్ పేర్కొన్నారు. ఇందాపూర్ డైరీ స్వాతంత్ర ప్రతిపత్తి గల కంపెనీ అని మహారాష్ట్రలో పూణేలో ఉందని దీని హెరిటేజ్ అనుబంధ సంస్థని వైసీపీ ప్రచారం చేస్తున్నదని, ఇంతవరకు హెరిటేజ్ సంస్థ ప్రభుత్వానికి గాని తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్రంలో ఏ దేవాలయానికి నెయ్య సరఫరా చేయడం లేదని హెరిటేజ్ సంస్థ స్పష్టంగా చెప్పినప్పటికీ దానిపై వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని బుద్ధ నాగ జగదీష్ మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ శాసనమండలి వెలుపల మీడియాతో మాట్లాడుతూ హెరిటేజ్ సీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు నమ్మించాలని ప్రయత్నం చేయడం చూస్తుంటే ప్రజలు ఏమి చెప్పిన నమ్ముతారని అనుకోవడం పొరపాటని అన్నారు
హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసు ఇవ్వడం జరిగిందని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే పరువు నష్టం దావా వేయడం జరుగుతుందని ఆ సంస్థ ప్రకటించిందని ఆధార లేని ప్రచారాలు చేస్తే భవిష్యత్తులో మరెన్నో కేసులు ఎదుర్కోవడం జరుగుతుందని వైసీపీ నాయకులకు ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments