Sunday, April 19, 2026
HomeNewsచిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందరం కృషి చేద్దాం

చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందరం కృషి చేద్దాం

శ్రీకాకుళం టౌన్ – జయ జయహే
చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందరం కృషి చేద్దామని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ అన్నారు. స్థానిక ఎస్బి కోలనీ ప్రాధమిక పాఠశాలలో చిన్నారులకు, పుస్తకాల బ్యాగ్ లను, పుస్తకాల కిట్లను, మండలవీధి ప్రసాద్ గురుస్వామి, కుప్పిలి జిల్లా పరిషత్ పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు ఉర్లం. రవితేజ్ చేతుల మీదుగా అందించి మాట్లాడుతూ ఇక్కడ విద్యార్థుల కోసం అడిగిన వెంటనే సహాయమందించిన, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు మేనేజర్ డా.టి.మణికంఠ రావుకు ప్రత్యేక దన్యవాదాలని, బాలల దినోత్సవంతోపాటు, ఆయన జన్మదినం పురస్కరించుకొని చిన్నారులకు ముందస్తు సేవలందించారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.గౌతమి, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ కిల్లారి.వెంకట రమణ, కె.శివ మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14న దేశమంతా పిల్లల పండుగను వేడుకగా జరుపుకుంటారని, పిల్లల చిరునవ్వులోని అమాయకత్వం, వారి హృదయాల్లోని స్వచ్ఛత, ప్రకాశవంతంగా అలా వెలుగుతూనే ఉండాలన్నారు. బాల్యం అనేది ఒక అందమైన ప్రయాణమని, మన జీవితాల్లో ప్రతిరోజూ చిరునవ్వులు, ఆనందాన్ని తెచ్చేది పిల్లలేనని, ఈ సందర్భంగా పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో చిన్నారులు, ఉపాధ్యాయులు, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు సిబ్బంది, సిఆర్పి కింజరాపు.తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments