Home News అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మకం

అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మకం

0

మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో విజయోత్సావం..

అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మకమని బిజెపి జిల్లా కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ అన్నారు. భీమవరం తాడిమళ్ల కాంప్లెక్స్ లో బుధవారం మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో రాజధాని చట్టబద్ధతపై హర్షం, అమరావతి విజయోత్సావం.. స్వీట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినోద్ వర్మ మాట్లాడుతూ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.రాష్ట్ర జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలమైన ప్రదేశం అమరావతి మహా నగరమని, ఏప్రిల్ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రాత్మక రోజుగా కలకాలం నిలిచిపోతుందన్నారు. క్లబ్ ఫౌండర్ మరియు కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ, కనగర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడిందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయమన్నారు. కురిశెట్టి నాని,గుండు సుమూర్తి , బొండా హనుమంతరావు, కంచర్ల భాస్కరరావు మాట్లాడుతూ అమరావతి రైతుల గౌరవానికి, వారి దీర్ఘకాల పోరాటానికి లభించిన న్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఇక రాజధాని లేని రాష్ట్రం కాదని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏప్రిల్ 6వ తేది గొప్పరోజుగా నిలిచి పోతుందన్నారు. అనంతరం బాటసారులకు స్వీట్స్ పంచిపెట్టారు. కార్యక్రమంలో సన్నిధి గుప్త, తటవర్తి బదరి, వబిలిశెట్టి వెంకటేష్, కారుమూరి కిరణ్, తటవర్తి నారాయణ,బాయ్స్ శ్రీనివాస్, బంగారు రాము, రేపాక మణి మెహన్, బీజేపీ, జనసేన నాయకులు వాకర్స్ సభ్యులు పాలుగొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version