Tuesday, June 16, 2026
HomePoliticsAndhra Pradeshరియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు 99 పైసలకే భూకేటాయింపులు 

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు 99 పైసలకే భూకేటాయింపులు 

ఏఎస్‌ఐపీ అనే కంపెనీకి 30 ఎకరాల భూమి 99పైసలకే ధారాదత్తం
– బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి విలువ రూ.1500 కోట్లకు పైనే
– రూ.30 కోట్ల క్యాపిటల్‌ లేని కంపెనీ రూ.2,387 కోట్ల పెట్టుబడా?
– ఉద్యోగాల కల్పన పచ్చి అబద్ధం. భూదోపిడీ మాత్రమే నిజం
– వైసీపీ జిల్లా అధ్యక్షులు కెకె రాజు ధ్వజం
పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు భారీ భూదోపిడీకి పాల్పడుతూ బినామీలకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను ధారాదత్తం చేస్తున్నాడని విశాఖ జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాటాడుతూ
రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు ఇన్నాళ్లూ ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా రూ.1500 కోట్లు విలువ చేసే 30 ఎకరాల భూమిని 99 పైసలకే ఏఎస్‌ఐపీ అనే కంపెనీకి కట్టబెట్టారని ఆక్షేపించారు. రూ.30 కోట్ల క్యాపిటల్‌ లేని ఆ కంపెనీ రూ.2,387 కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని.. 1000 మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తుందని నిలదీశారు. మరోవైపు 99 పైసలకే భూములిచ్చిన సత్వా, ఉర్సా, కపిల్, రహేజా వంటి కంపెనీలు ఇప్పటివరకు పనులు కూడా ప్రారంభించలేదని విశాఖ సిటీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కెకె రాజు గుర్తు చేశారు. ఈ సమావేశంలో కెకె రాజు ఇంకా ఏం మాట్లాడారంటే..:
చిత్తశుద్ధి ఉంటే భూములు వేలం వేయాలి:
విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు అప్పగించకుండా, ఆ భూములకు బహిరంగ వేలం నిర్వహించాలి. అప్పుడు నిజమైన కంపెనీలే ముందుకు వస్తాయి. అలాగే భారీ పెట్టుబడులతో వీలైనంత త్వరగా కార్యకలాపాలు మొదలుపెడతాయి. తద్వారా విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా, స్థానిక యువతకు ఉపా«ధి, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. అలా కాకుండా ఇలా పప్పు బెల్లాలకు వేల కోట్ల విలువైన భూములు ఊరూ, పేరూ లేని కంపెనీలకు కట్టబెడితే ఇటు విశాఖ నగరానికి కానీ, అటు ప్రజలకు కానీ, ఒక్కటంటే ఒక్క మేలు జరగదు. చంద్రబాబు అడ్డగోలు భూదోపిడీకి వ్యతిరేకంగా మా పార్టీ ప్రజలతో కలిసి పోరాతుంది. ఇంతకు ముందు ఉర్సా, సత్వా, ఏఎన్‌ఎస్‌ఆర్, రహేజా, కపిల్‌ వంటి కంపెనీలకు రూపాయికే ఎకరా భూమి ఇచ్చేసిన చంద్రబాబు ఇప్పుడు మరింత బరితెగించి అడ్వాన్స్‌డ్‌ సిస్టం ఇన్‌ ప్యాకేజ్డ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌ఐపీ) అనే సెమీ కండక్టర్‌ కంపెనీకి 30 ఎకరాల భూమిని 99 పైసలకే కట్టబెట్టేశాడు. విశాఖపట్నంలోని తర్లువాడ గ్రామంలో ఉన్న ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.50 కోట్లకు పైనే పలుకుతోంది. అంటే రూ.1500 కోట్లు విలువ చేసే భూమిని చంద్రబాబు కేవలం 99 పైసలకే రాసిచ్చేశాడు.
గతంలో భూములందుకున్న లూలూ మాల్‌కి, సత్వా, రహేజా, కపిల్‌ వంటి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు చంద్రబాబు భూములు కేటాయించినా ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. ఇదే సత్వా కంపెనీ హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరం రూ.174.60 కోట్లకు సొంతం చేసుకుంటే చంద్రబాబు మాత్రం విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే అప్పనంగా ఇచ్చేశాడు.
కమీషన్ల కోసం ప్రభుత్వ భూములను అప్పనంగా రాసిచ్చేస్తున్నారు. పెట్టుబడుల పేరుతో కట్టుకథలు చెప్పి బోగస్‌ కంపెనీల ముసుగులో విలువైన భూముల దోపిడీ జరుగుతోంది. ఈ సమావేశంలో తూర్పు సమన్వయ కర్త మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు .
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments