Home Politics Andhra Pradesh జబల్పూర్‌ లో గిరిజన యువకుడు కొర్ర విశ్వనాధ్ సత్తా.

జబల్పూర్‌ లో గిరిజన యువకుడు కొర్ర విశ్వనాధ్ సత్తా.

0

ఐదు బంగారు పతకాల కైవసం.

ఇండియన్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2026 ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు.ఈ పోటీల్లో డుంబ్రిగూడ మండలం రంగినివలస గ్రామానికి చెందిన గిరిజన యువకుడు కొర్ర విశ్వనాధ్ ప్రతిభ చాటుతూ ఐదు పతకాలను కైవసం చేసుకున్నారు.
పోటీల్లో విశ్వనాధ్ 4×100 మీటర్ల రిలేలో మొదటి స్థానం, 4×400 మీటర్ల రిలేలో మొదటి స్థానం సాధించారు. అదేవిధంగా 100 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానం, 400 మీటర్ల పరుగుపందెంలో రెండవ స్థానం, 800 మీటర్ల పరుగుపందెంలో మూడవ స్థానం సాధించి మొత్తం ఐదు పతకాలు దక్కించుకున్నారు.ఇప్పటివరకు వివిధ అథ్లెటిక్స్ మీట్లలో పలు కేటగిరీల్లో పాల్గొని మొత్తం 16 పతకాలను సాధించినట్లు విశ్వనాధ్ విలేకరులకు తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంతం నుంచి జాతీయ స్థాయి పోటీల్లో రాణించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version