Home Politics Andhra Pradesh స్మశాన దారి కోసం శవ యాత్ర

స్మశాన దారి కోసం శవ యాత్ర

0

వెంకోజీపాలెం వాసుల దిష్టి బొమ్మ తో నిరసన

స్మశానానికి దారి కల్పించాలంటూ వెంకోజిపాలెం వాసులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న స్మశానానికి దారి లేకపోవడం బాధాకరంగా ఉందని వాపోయారు. స్మశానానికి దారి లేకపోవడం వల్ల మృతదేహాన్ని రోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కార్యక్రమాన్ని చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రీ సీతారామ సేవా సంఘం, గ్రామ సేవా సంఘం ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాడినప్పటికీ, ఎన్ని ప్రభుత్వాలు మారిన దారికి మోక్షం కల్పించక పోవడంతో, గ్రామస్తులు తమ సొంత నిధులను ఉపయోగించి, సీ సి రోడ్డును నిర్మించుకున్నారు. అయితే దారి విషయం కోర్టులో ఉందని, రోడ్డు నిర్మాణం చేయకూడదని దేవస్థానం అధికారులు గ్రామస్తులపై విరుచుకుపడి రోడ్డు వేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో గ్రామస్తులంతా ఏకమై తమ స్మశానానికి దారిని కల్పించాలని కోరుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని మహిళలు, యువకులు , పెద్దలు అందరూ కలిసి స్మశాన వాటిక వద్ద వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టి స్మశాన దారిని అడ్డుకుంటున్న వారిని శవం కింద ఏర్పాటు చేసి, దానికి దహన సంస్కరాలు నిర్వహించి తమ ఆందోళన వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version