హాజరుకానున్న కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి
పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై ఆరా
సోమవారం నక్కపల్లిలో జరగనున్న దేశంలోనే అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్’ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొనేందుకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖపట్నం చేరుకున్నారు. నక్కపల్లిలో 1.35 లక్షల కోట్లతో నూతనంగా నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ లు పాల్గొన్నన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకు ముందు ఉభయ మంత్రులు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ప్లాంట్ పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
