Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshగర్భిణీలకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేసిన కంబాల

గర్భిణీలకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేసిన కంబాల

విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేపట్టిన ప్రజా సేవ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ కార్యక్రమం ఒకటి. సుమారుగా రెండేళ్ల నుంచి గోకవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణీలు, అక్కడికి చికిత్స కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి మంగళవారం పండ్లు, పాలు, రొట్టెలను కంబాల శ్రీనివాసరావు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ మంగళవారం కూడా యధావిధిగా రామసేన సభ్యులు పెద్దాడ వెంకన్న దొర, సిబ్బంది బాబీ, వీరబాబు గర్భిణీలు, రోగులకు పాలు, పండ్లు, రొట్టెలను అందజేశారు. తన సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని, తన వద్దకు కష్టం అని వచ్చిన వారికి, లేదనకుండా సహాయం చేసి తిరిగి పంపిస్తున్నానని, కంబాల శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కేబుల్ రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments