Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshప్రతిభ తోనే ఉద్యోగ అవకాశాలు

ప్రతిభ తోనే ఉద్యోగ అవకాశాలు

నైపుణ్యం నాణ్యమైన విద్య తోనే భవిష్యత్తు, సమగ్ర నైపుణ్యం అవగాహనతో కూడిన విద్య విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు లాంటివని, దీని ద్వారానే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు.
విద్యార్థులు నైపుణ్య అభివృద్ధిని సాధించాలని ఓ మంచి లక్ష్యంతో భవిష్యత్తుకు బాటలు వేసి శాశ్వత అభివృద్ధికి అడుగులు వేయాలని ఆయన అన్నారు.
కళాశాలలో 43 మంది విద్యార్థులు తమ ప్రతిభతో ఏడాదికి రెండున్నర లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాల పొందడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు, ఖమ్మం కు చెందిన ప్రముఖ టెక్ వేవ్ ఇన్ఫోటెక్ సంస్థ లో సుస్థిర మైన అవకాశాలు పొందడం ఆనందదాయకమని డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ ఎం సంతోష్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments