ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ నెల 10న కే కోటపాడు అయ్యన్న డిగ్రీ కళాశాలలో సుమారు 20 బహుళజాతీయ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు బండారు సత్యనారాయణమూర్తి సోమవారం తెలిపారు.ఈ ఇంటర్వ్యూలకు పదవ తరగతి, ఐ టి ఐ, డిప్లొమా,డిగ్రీ, పి జి వరకు చదువుకొని 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు.కాబట్టి ఆసక్తి కలిగిని నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరములను నైపుణ్యం. ఏపీ.జివోవి.ఐఎన్ వెబ్ సైట్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని, అడ్మిట్ కార్డు తో పాటుగా ఎక్కువ రెస్యూమేలు, ఆదార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు జెరాక్స్ లతో జాబ్ మేళా జరుగు ప్రదేశానికి ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
