ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఈ నెల 30న సుమారు 12 బహుళజాతీయ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి ఎన్. గోవింద రావు గురువారం తెలియజేసారు, ఈ ఇంటర్వ్యూలకు పదవ తరగతి, ఐ టి ఐ, డిప్లొమా, డిగ్రీ , పి జి వరకు చదువుకొని 18 నుండి 40 ఏళ్ళు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు.
కాబట్టి ఆసక్తి కలిగిని నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరములను నైపుణ్యం. ఏపీ.జిఓవి.ఐఎన్ వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, అడ్మిట్ కార్డు తో పాటుగా ఎక్కువ రెస్యూమేలు, ఆదార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు జెరాక్స్ లతో జాబ్ మేళా జరుగు ప్రదేశానికి ఉదయం 9 గంటలకు హాజరు కాగలరన్నారు.మరిన్ని వివరముల 94947 91935 నంబర్ను సంప్రదించగలరు.
