Home Politics Andhra Pradesh ఆల్ ఇండియా టైక్వాండోలో జస్విక ప్రతిభ

ఆల్ ఇండియా టైక్వాండోలో జస్విక ప్రతిభ

0

ఉత్తమ ప్రతిభ ఎవరి సొత్తు కాదు ,కష్టేఫలి సాధించాలనే తపన ఉంటే ఎవరికైనా ఫలితాలు వరిస్తాయి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ క్రీడా కేంద్రం నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా టైక్వాండో పోటీల్లో పులి బంధ జస్విక తన ప్రతిభను కనబరిచింది .

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోడి రామమూర్తి క్రీడా మైదానంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మహిళా టైక్వాండో క్రీడలో ఎంపిక జరిగింది, ఈ పోటీల్లో 57 కేజీల మహిళా విభాగం క్రీడల్లో జస్విక పాల్గొంటుందని శిక్షకులు నర్సిపురం శేఖర్ తెలిపారు.

ఈ క్రీడపోటీలు ఒడిస్సా రాష్ట్రం బాలాసోర్ పట్నంలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు, జస్విక ఎంపిక పట్ల జిల్లా క్రీడాధికారి మహేష్ బాబు అభినందనలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version