Home Politics Andhra Pradesh మహిళా సాధికారతకు భారీ ఊతం – రూ.149.34 కోట్ల రుణాల పంపిణీ

మహిళా సాధికారతకు భారీ ఊతం – రూ.149.34 కోట్ల రుణాల పంపిణీ

0

నిడదవోలులో మహిళల ఆర్థిక సాధికారతకు ఊతమిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో రుణాలు పంపిణీ చేశారు. పట్టణంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 1,211 స్వయం సహాయక సంఘాలకు చెందిన 11,850 మంది మహిళలకు మొత్తం రూ.149.34 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆహార పదార్థాల తయారీ రంగంలో ముందుకు రావాలని ప్రోత్సహించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా క్యూలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version