Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshనేటి నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వం

నేటి నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వం

తూర్పు ప్రతినిధి శ్రావణి వెల్లడి
జనసేన పార్టీ సభ్యత్వం ఈ నెల 26 నుంచీ ప్రారంభం కానుందని ఆ పార్టీ తూర్పు నియోజక వర్గ 12వ వార్డు ప్రతినిధి సురుపల్లి శ్రావణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన ఉద్యమి సభ్యత్వం వల్ల పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం లభించడంతో పాటు కార్యక్రమాల్లో ప్రాధాన్యతకల్పిస్తారన్నారు. పార్టీ కమిటీల్లో బాద్యతలు తీసుకునేందుకు సభ్యత్వం తప్పనిసరిగా పేర్కొన్నారు. సభ్యత్వం ఉన్న వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. నాయకత్వ శిక్షణ, నాయకులుగా ఎదిగే అవకాశాలను పార్టీ కల్పించనుందన్నారు. అంతే కాకుండా రూ. 5 లక్షల ప్రమాద భీమా ద్వారా ఆ కుటుంబానికి ఆర్దిక భరోసా ఉంటుందని, ప్రమాదవశాత్తు ఆస్పత్రి పాలైతే రూ. 50 వేల మెడికల్‌ పాలసీ ఉంటుందని చెప్పారు. ఉద్యమి సభ్యత్వం కోసం ఆధార్‌ కార్డు, ఫోటో, నామినీ ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌, రూ. 400 సభ్యత్వ రుసుం కావాలని వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments