Home Politics Andhra Pradesh రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఏపీ మీడియా కో-ఆర్డినేటర్‌గా జమ్ముగాని మోహన్ నియామకం

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఏపీ మీడియా కో-ఆర్డినేటర్‌గా జమ్ముగాని మోహన్ నియామకం

0

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) పార్టీ ఆంధ్రప్రదేశ్ మీడియా కో-ఆర్డినేటర్‌గా గుంటూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు జమ్ముగాని మోహన్ ను నియమించినట్లు ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఆర్‌పీసీ సీనియర్ నాయకుడు పెండ్యాల కామరాజు సోమవారం అధికారికంగా వెల్లడించారు. ఈ నియామకానికి ఆర్‌పీసీ కో-ఆర్డినేటర్ పంగులూరి బుచ్చిబాబు సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జమ్ముగాని మోహన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలు, పేదరికం లేని సమాజ నిర్మాణం, మానవ హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై సుదీర్ఘకాలంగా పోరాడుతున్న మేడా శ్రీనివాస్ ఆలోచనలు తనను ఆకర్షించాయని తెలిపారు. మెరుగైన విద్యా, వైద్య ప్రమాణాలు అమలు చేయాలనే లక్ష్యంతో ఆర్‌పీసీ పార్టీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేస్తానని, త్వరలో గుంటూరు సహా ఇతర జిల్లాల్లో పార్టీ కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తానని మోహన్ తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన మేడా శ్రీనివాస్‌కు, తనను సిఫార్సు చేసిన పంగులూరి బుచ్చిబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version