Home Politics Andhra Pradesh పేదవాడి సొంత ఇంటి కల జగన్ రెడ్డికి ఇష్టం లేదు: మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ...

పేదవాడి సొంత ఇంటి కల జగన్ రెడ్డికి ఇష్టం లేదు: మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

0

అనకాపల్లి జయ జయహే
నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో టిడిక్కో గృహాలకు రాష్ట్రవ్యాప్తంగా రంగులు మార్చే వాటిని పాడు బట్టి ఒక రూపాయి నిధులు కూడా కేటాయించకుండా ఐదు సంవత్సరాలు లబ్ధిదారులకు గృహాల కోసం పరితపించే విధంగా, వారికి చుక్కలు చూపించే వారిని నట్టేట ముంచి ఇల్లులు ఇవ్వకుండా ఆఫీసులు చుట్టూ తిరుగేలా ఐదేళ్లు చేసి ,ఈనాడు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వంలో మూడు లక్షల గృహాలకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేసే లబ్ధిదారులకు గృహప్రవేశాలు కల్పిస్తూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక పేద ప్రజలకు అందుతున్న ఇల్లులు చూసి ఓర్వలేక జీర్ణించుకోలేకపోతున్నాడని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీష్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాలకు25 లక్షల గృహాలను నిర్మించే ఇస్తానని ప్రగల్బాలు పలికి కనీసం ఐదు శాతం ఇల్లులు కూడా నిర్మించి ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రిగా పేరుగాంచారని, పేదవాళ్ళకి సెంటు భూముని చెప్పి రైతుల నుండి వైసీపీ కార్యకర్తలు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అమ్మి 7,500 కోట్లు లూటీ చేశారని నాగ జగదీష్ మండిపడ్డారు. ఈ పట్టాలు కూడా చెరువుల్లోనూ స్మశానాల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కేటాయించారని లోతట్టు ప్రాంతాల్లో కేటాయించిన చిన్న వర్షానికి మునిగిపోయ ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారని లబ్ధిదారులు జగన్ రెడ్డిని అందుకే గట్టిగా ఓడించారని ఆ విషయం మరిచిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సిగ్గు ఎగ్గు లేకుండా నా క్రెడిట్ చంద్రబాబు కొట్టేసారని చెప్పడం నీతి బాహ్య చర్యలని నాగ జగదీష్ అన్నారు. ఇచ్చిన పట్టాల్లో గృహ నిర్మాణాలు ప్రభుత్వ పరంగా నిర్మిస్తామని చెప్పి ఒక్కొక్క లబ్ధిదారు నుండి 35000 వైసీపీ కార్యకర్తలు వసూలు చేసి దోచుకున్నారని లబ్ధిదారులను గాలికి వదిలేసారని ఈనాటి కూడా ఆ ఇల్లు నిర్మాణాలు సక్రమంగా నిర్మాణాలు ఇంకా జరగలేదని అసంపూర్తిగా ఉండిపోయాయని లబ్ధిదారులను గాలికి వదిలేసారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని ఎస్సీ ,బిసి లబ్ధిదారులకు 50,000 ఎస్టీ లబ్ధిదారులకు 75000 ఆదివాసి గిరిజన లబ్ధిదారులకు లక్ష చొప్పున అదనపు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు నిధులు విడుదల చేశారని అందులో భాగంగానే మూడు లక్షల గృహాలు పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఈనాడు అందించారని పేదలకు న్యాయం జరిగినందుకు అభినందించవలసింది పోయి జగన్ రెడ్డి తాను చేయలేని పనులు కూడా తానే చేశానని ఒక మానసిక రోగం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నాడని నాగ జగదీష్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇకనైనా రాష్ట్ర అభివృద్ధి సహకరించి నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని అంతే తప్ప అవాకులు చవాకులు పేలితే వైసిపి పార్టీ ఇప్పటికే తెరమరుగు అవుతున్నదని, లేకపోతే వైసిపి పార్టీ భూస్థాపం కావడం ఖాయం అని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు నాగ జగదీష్ హెచ్చరించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version