వైసీపీ నేత పెండ్ర వీరన్న
శాసనమండలి సమావేశాల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న కింజరపు అచ్చెనాయుడు మాట్లాడుతూ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు క్రిస్టియన్ అని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని మాట్లాడుతూ దూషించడం తగదని వైసీపీ ఎంబీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న ఖండించారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పై మతాన్ని ఆపాదించడం, కూటమి ప్రభుత్వానికి సరికాదని, మండలిలో లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరుగుతుండగా, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి , మండలి చైర్మన్ ఇద్దరూ క్రిస్టియన్స్ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం ముమ్మాటికీ కూటమి ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఇలాంటి మత పేరుతో కుల పేరుతో రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు. చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే సమావేశాలు జరుగుతుండగా ఆర్దిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గాని, నిన్న కింజరపు అచ్చయ్యనాయుడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని వీరన్న దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధమైన చైర్మన్ గా ఉన్న వ్యక్తికి మతాన్ని ఆపాదించి విమర్శించడం కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని వీరన్న అన్నారు. సమావేశాల్లో బడుగు బలహీన పేద వర్గాల సంబంధించిన అంశాలపై గాని రైతుల గురించి గానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి గానీ తదితర అంశాలపై చర్చించకుండా మతానికి సంబంధించిన అంశంపై మాత్రమే చర్చించి ప్రజలను మభ్యపెట్టే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను మత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఇదేవిధంగా కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పెండ్ర వీరన్న అన్నారు.
