Home Politics Andhra Pradesh మూడవసారి ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తమరాన

మూడవసారి ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తమరాన

0

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తమరాన త్రినాద్ 3వసారి ఎన్నికయ్యారు.ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సభ్యులు త్రినాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.త్రినాద్ ప్రస్తుతం బుచ్చయ్య పేట మండలం పి.కందిపూడి యూపీ స్కూల్లో పని చేస్తున్నారు.ఇతను గతంలో బుచ్చయ్యపేట మండలశాఖ అధ్యక్షునిగా, జిల్లా సబ్ కమిటీ సభ్యునిగా నాలుగు పర్యాయాలు చొప్పున, ఒకసారి ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2022,2024లలో రెండు పర్యాయాలు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు.ఈ సందర్భంగా సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర నాయకులు పాండురంగ వరప్రసాద్ కి,రాష్ట్ర అధ్యక్షులు మంజులకి, ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావుకి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా త్రినాధుని పలువురు అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version