Wednesday, April 22, 2026
HomeNewsఎంవిపి రైతు బజార్ ను సందర్శించిన ఐఎస్ఒ .

ఎంవిపి రైతు బజార్ ను సందర్శించిన ఐఎస్ఒ .

విశాఖ ఎంవీపీ కాలనీ రైతు బజార్ ను సోమవారం ఐఎస్ఒ శివయ్య సందర్శించి, పరిశీలించారు. ఈ పర్యటనలో రైతు బజార్ పరిసరాలను, ఆర్వో వాటర్ ప్లాంట్ను, టాయిలెట్స్ మెంటైనేన్స్ ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. రైతు బజార్ కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి తనిఖీ చేసారు. రైతు బజార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని, రైతులను, వినియోగ దారులను కోరారు. బజారులోని రైతులతోను, డ్వాక్రా సంఘాల సభ్యులతోను మాట్లాడి రైతు బజార్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలను తెలుసుకున్నారు. రైతులందరికీ ముందు చూపుతో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె.వరహాలు, సహాయకుడు కనక రాజు, రైస్ కౌంటర్ మురళి, వాచ్ మన్ దేముడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments