విశాఖపట్నం, జయ జయహే: పద్మనాభంలో కొలువైన అనంత పద్మనాభస్వామి దీపోత్సవానికి హాజరు కావాలని కోరుతూ కార్యనిర్వాహణాధికారి రాజు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు శుక్రవారం ఆహ్వాన పత్రికను ఆయన నివాసంలో అందజేశారు. ఈనెల 19 వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు దీపోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. గతం కంటే ఎక్కువమంది ఈసారి దీపోత్సవానికి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి గంటా ఆరా తీశారు.
