Home News అరకు ఎంపిటిసి వరహాలమ్మ దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరిక

అరకు ఎంపిటిసి వరహాలమ్మ దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరిక

0

అరకు ఎంపిటిసి వరహాలమ్మ దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరిక

అరకులోయ: జయ జయహే.

డుంబ్రిగూడ మండలం అరకు సెగ్మెంట్ ఎంపీటీసీ వరాహలమ్మ,నాగేష్ దంపతులు శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరిక. డుంబ్రిగూడ మండల అధ్యక్షులు కిల్లో ఆనందరావు. ఆధ్వర్యంలో అరకు వేలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి విజయనగరం జోన్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్.సియ్యారి దొన్నుదొర సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీటీసీ వరహాలమ్మ మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి పార్టీపై ప్రేమతో నియోజకవర్గ ఇన్చార్జి సమక్షంలో గూటికి చేరాలని తెలుగుదేశం పార్టీ అరకు ఇన్చార్జి దొన్ను దొర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో పని చేస్తానని పార్టీ అధిష్టానం నాకు పదవి ఇచ్చినా. ఇవ్వకపోయినా పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే దానికి నేను ఒక కార్యకర్త లాగా కష్టపడి పనిచేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అరకు ఇంచార్జి దొన్నుదొర మాట్లాడుతూ. పార్టీలో కష్టపడే నాయకులు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సముశిత స్థానం కల్పిస్తామని దానిలో ఎటువంటి సందేశం లేదని మీరు పార్టీ కొరకు పార్టీ నిర్మాణం కొరకు మీ పరిధిలో నిరంతరం పార్టీ ప్రతిష్ట కొరకు కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగూడ మండల అధ్యక్షులు కిల్లో ఆనందరావు. అరకు నియోజకవర్గం ఎస్టీ సేల్ అద్యక్షులు బురిడీ కొమ్ములు నాయుడు. బాలరాజు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version